4 | Page 18

నేను లేకపొతే మనిషి బ్రతకలేడు అని ఉన్న నాకు ఒక గువ్వా అడిగిన ప్రశ్నలివి :

తల్లిదండ్రులు తమ బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటారు . మరి నీకేవరున్నారు ?

తల్లా ?? తండ్రా ??

అమ్మ గోరుముద్దలు , జోల పాట నాన్న అండ దండ పొందలేని జీవం లేని నువ్వు వాటిని దూరం చేయగలవా??

తోబోట్టువుల ప్రేమ తెలియని నీకు వాటిని విడతీసే అర్హత ఉందా ?

బంధానికి అర్ధం తెలియని ఓ కాగితపు ముక్కా నీకు దాని వాటి గొప్పతనం తెలుసా??

క్షణక్షణానికి , మనిషి మనిషికి విలువ మారే నీ జీవితానికి ఒక అర్ధం ఉందా?

ఈ ప్రశ్నలు విన్న నాకు కలిగిన భావం ఇది :

"మనిషి జీవితం లో నేను ఒక భాగం మాత్రమే

మనిషి , బంధాలు నన్ను సృష్టించాయి . కానీ నేను వాటిని సృష్టించలేను , అణచివేయలేను .

అది నా భ్రమ మాత్రమే.

నేను మనిషి జీవితం లో ఒక భాగాన్ని మాత్రమే . అలా ఉండటమే ఇద్దరికీ మంచిది .

" అతి అనర్ధానికి కారణం "

అలానే నేనే జీవితం అనుకుంటే

మనిషి తన అస్తిత్వాన్ని కోల్పోయే రోజు రావచ్చు

తుది పలుకుగా

"మనిషి మనిషిగానే ఉండాలి 'మనీ' షి గా మారొద్దు. "