వ్యాపారం లో మనం అంతా లాభం ఆశిస్తాం , కానీ లాభం లేక పోయినా కానీ అదే వ్యాపారం చేస్తూ గడుపుతున్నాడు శ్రీనివాస్ . అతనికి సహాయంగా అతని తమ్ముడు తేజ కూడా ఇదే పని చేస్తున్నాడు. చదువుకుందామన్న చదువుకోలేని పరిస్థితి తనది. 10 కంటే ఎక్కువ చదివే స్థోమత లేదని తెలుసుకుని తను కూడా అన్నకు సహాయంగా ఉంటున్నాడు.
డబ్బే జీవితం అని ఎంతో మంది బ్రతుకుతున్నారు , డబ్బు లేకపోతే జీవితమే లేదని చాలా మంది
ప్రాణాలు తీసుకుంటున్నారు . కానీ జీవితం లో తనకు ఎదురైనా కష్టాలని తన చిరునవ్వుతో ఎదిరిస్తూ , సహనం తో పోరాడుతూ , గమనం లేని గమ్యం కోసం ఎదురుచూస్తున్నాడు శ్రీనివాస్ .
Jyoti Dhruwe
( English version)
.