4 | Page 13

జీవితం అనేది తీరాన్ని తాకే కెరటం లాంటింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటేనే కానీ ప్రశాంతమైన గమ్యాన్ని చేరదు. ఆ తీరం పక్కనే ఉన్న ఒక గమనమెరుగని ఒక జీవిత కథ ఇది .

శ్రీనివాస్ , కాకినాడ లో మొదలైన తన కథ విశాఖ తీరం చేరింది . ఆకలి తో అలమటిస్తూ , చేయూత కోసం ఎదురుచూస్తున్న ఒక " గోడావాల " తను . కష్టాలకి కేర్ అఫ్ అడ్రస్ అతని జీవితం. ఎన్నో ఆశలతో 2 లక్షలు పెట్టి కొనుకున్న గుర్రమే అతని ఆస్తి అతని బంధువు అతని నేస్తం , అతని కష్టం కూడా. రోజుకి 200 కి కూడా గతి లేని అతని వ్యాపారం , తిరిగి చూసుకుంటే తిండిలేని రోజులు , నిద్ర లేని రాత్రులు తప్ప ఒక అందమైన రోజు కూడా లేదు.

సాగర తీరం లో రోజుకు ఎంతో మంది జనం కేరింతలు కొడుతూ ఉంటారు , ఆనందంతో గెంతులు వేస్తుంటారు , గుర్రం పక్క పోసులు కూడా ఇస్తూ ఉంటారు కానీ ఇతని పెదవి పై ఉన్నచిరునవ్వు వెనకాల ఉన్న బాధ ని ఎవరు చూడరు .. తన గుర్రం ఎక్కితే బాగుండు అనే తపన , ఎక్కుతారు అనే ఆశ ఎవరు గమనించరు. మనం రోజు వ్యర్దoగా ఖర్చుపెట్టే 40 రూపాయలు ఒక మనిషి బ్రతుకు తెరువుకు ఆశదీపాలు .ఒక్క ట్రిప్ గుర్రం ఫై తీస్కువెల్లి , సాగర తీరమంతా మిమ్మల్ని తిప్పడానికి అతను తీసుకునేది కేవలం 40 రూపాయలు. కానీ అతను తన గుర్రం కడుపు నింపటానికి ఖర్చుచేసేది నెలకు 500 రూపాయలు. ఇంకా దాన్ని అందంగా , ఆకర్షణీయంగా అలంకరించడానికి ఇంకా ఖర్చు అవుతుంది